కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చూపే ప్రయత్నం.. సమీర్ చౌదరిగా మార్చే యత్నం

చేతికున్న ఎర్రదారాన్ని సాకుగా చూపిన లష్కరే తోయిబా ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా వెల్లడి

admin1
Updated on: 18 Feb 2020 10:56 PM IST
కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చూపే ప్రయత్నం.. సమీర్ చౌదరిగా మార్చే యత్నం
X
కసబ్ ఫైల్ ఫోటో

ముంబై దాడుల కేసులో ఉరిశిక్ష బారిన పడిన కరడు గట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను పాకిస్థాన్ హిందూ ఉగ్రవాదిగా చూపించే ప్రయత్నం చేసిందా? అంటే అవుననే అంటున్నారు ముంబై మాజీ పోలీస్ కమిషనర్..పక్కా పాకిస్థానీ అయిన కసబ్ ను హిందూ ఉగ్రవాదిగా చూపేందుకు కసబ్ చేతికున్న ఎర్ర దారాన్నే సాకుగా చూపించారని ముంబై మాజీపోలీస్ కమిషనర్ రాకేశ్ మరియా వెల్లడించారు. లెట్ మీ సే ఇట్ నౌ పుస్తకంలో కసబ్ కేసు విచారణ సమయంలో ఏం జరిగిందన్నది కూలంకషంగా వివరించారు.

ముంబై పేలుళ్లను హిందూ ఉగ్రవాదుల కుట్రగా చూపేందుకు పాకిస్థాన్ చాలా ప్రయత్నాలే చేసింది. కసబ్ చేతికున్న ఎర్రదారాన్ని చూపి అతడిపేరు సమీర్ దినేశ్ చౌదరి అని బెంగుళూరు వాసి అనీ నమ్మించడానికి లష్కరే తోయిబా ప్రయత్నించింది.


admin1

admin1

Next Story