సిద్దూపై పాక్‌ సెనేటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సిద్దూపై పాక్‌ సెనేటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

భారత్‌లోని డేరా బాబా నానక్‌ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో వున్న దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం ప్రారంభించింది.

భారత్‌లోని డేరా బాబా నానక్‌ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో వున్న దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం ప్రారంభించింది. అంతకుముందు గురునానక్ 500వ జయంతి సందర్భంగా పాకిస్థా్న్ నాణేలు ‌కూడా విడుదల చేసింది. కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంబోత్సవానికి 500 మంది యాత్రికులతో కూడిన భారత బృందం అక్కడికి వెళ్లింది.

భారత మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా వారితో కలిసి వెళ్లారు. అయితే కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవ ఆయన హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ సిద్దూను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌తో కలిసి కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌పై నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. కారిడార్ ప్రారంబోత్సవానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్తార్‌పూర్‌ కారిడర్ నిర్మాణానికి సహాకరించిన ఇమ్రాన్ ఖన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దూ గురించి పాకిస్తాన్‌ సెనేట్‌ ఫైజల్‌ జావెద్‌ ఖాన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ తో నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు మంచి సంబంధాలు ఉన్నాయని. సిద్ధూ పాక్ మంచి స్నేహితుడని తెలిపారు. సిద్ధూ తన క్రికెట్ కెరీర్ లో పాక్ పై సెంచరీలు సాధించలేదని పేర్కొన్నారు. 1989-90లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టులో సిద్దూ ఉన్నాడు. పాక్ పై జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు మాత్రమే సాధించాడు. పాక్‌ సెనేటర్‌ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories