అందుకే ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదు

అందుకే ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదు
x
Upendra Rao
Highlights

కన్నడ సినీనటుడు ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై స్పందించారు.

కన్నడ సినీనటుడు ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై స్పందించారు. సినిమాల్లో బీజీ షెడ్యూల్ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే రానున్న ఉపఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆయన.. వచ్చే ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పార్టీ పెట్టిన సంగతి తెలిసింద. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. వచ్చే ఉపఎన్నల్లో పోటీ చేయడంలేదని తేల్చి చెప్పారు. దానికి కారణం సినిమాల్లో బీజీగా ఉండడమే అని వెల్లడించారు. రాజకీయాలపై తాను మాట్లాడనని, ప్రజలే న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు.

అయితే కర్ణాటక లోని15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు డిసెంబరు 5 జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్ -జేడిఎస్ కూడా ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి గుణపాఠం చెప్పాలని చూస్తుంది. కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ సమయంలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ బీజేపీకి మద్దతు ప్రకటించిన 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories