రాజీనామా యోచనలో కర్ణాటక సీఎం కుమారస్వామి ?

రాజీనామా యోచనలో కర్ణాటక సీఎం కుమారస్వామి ?
x
Highlights

కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉన్న సంకీర్ణ రాజకీయం సంక్షోభం ఒక్క సారిగా బద్దలైంది. కీచులాటలతో మొదలైన...

కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉన్న సంకీర్ణ రాజకీయం సంక్షోభం ఒక్క సారిగా బద్దలైంది. కీచులాటలతో మొదలైన కాంగ్రెస్, జేడీఎస్ హనీమూన్ ముగిసింది. 15 మంది ఎమ్మెల్యేలు కూటమిపై తిరుగుబాటు ప్రకటించి బీజేపీ పంచన చేరే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ కార్యాలయంలో రాజీనామాలిచ్చిన నేతలను బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పడింది. కీలక నేత శివకుమార్ వారితో మాట్లాడి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి రాజీనామాలు చించేసి వారిని బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. చీలిక వర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ద రామయ్యను సీఎంను చేస్తే వెనక్కు వస్తామంటూ షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు అమెరికాలో ఉన్న కర్ణాటక సీఎం కుమార స్వామి రేపు బెంగళూరు చేరుకుంటున్నారు విశ్వాస పరీక్ష ఎదుర్కో కుండానే రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. అదే గనక జరిగితే బీజేపీ పంట పండినట్లే ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు తగ్గ కసరత్తు చేస్తోంది. చీలిక వర్గం ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా ఛార్టెర్డ్ విమానంలో ముంబైకి తరలించినట్లు సమాచారం. కాంగ్రెసె, జేడీఎస్ మద్య మంత్రి పదవుల పంపకంలో వచ్చిన విభేదాలు కూటమిలో కొట్లాటకు కారణమయ్యాయి.

దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్నబీజేపీకి.. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో విభేదాలు ఒక అస్త్రంగా కనిపించాయి. జేడీఎస్ లో కీలక నేత విశ్వనాథ్ ఈ ఆపరేషన్ కు ప్లాన్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వెనక ఉన్నది బీజేపీ నేతలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన మద్దతుందని బీజేపీ నేత సదానందగౌడ అనడం చూస్తుంటే.. బీజేపీ పకడ్బందిగా ఆపరేషన్ కర్ణాటక జరుపుతోందనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories