కుమారస్వామి సర్కార్ కూలిపోతుందా..ఒక్క ఎమ్మెల్యే దూరంలో బీజేపీ..

కుమారస్వామి సర్కార్ కూలిపోతుందా..ఒక్క ఎమ్మెల్యే దూరంలో బీజేపీ..
x
Highlights

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజీనామాకు సిద్ధపడ్డ 15మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించేందుకు స్పీకర్...

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజీనామాకు సిద్ధపడ్డ 15మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించేందుకు స్పీకర్ ఆఫీసుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే స్పీకర్ కోసం ఎదురుచూస్తున్నారు.

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. మంగళవారం నాడు తాను కార్యాలయానికి చేరుకుంటానని అప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని.. స్పీకర్ తెలిపారు. తమ కార్యాలయానికి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని వెల్లడించారు. ఆదివారం కార్యాలయానికి సెలవు దినం కావడం సోమవారం తాను బెంగళూర్‌లో అందుబాటులో ఉండనిని స్పీకర్ వెల్లడించడంతో మంగళవారమే నిర్ణయం వెలువడనుంది.

మరోవైపు, పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. రాజీనామా చేయనున్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పని మొదలుపెట్టారు. డికె శివ కుమార్‌తో పాటు మరికొందరు సీనియర్ నాయకులు రంగంలో దిగారు. ఎమ్మెల్యేలు చే జారి పోకుండా చూసే పనిలో ఉన్నారు.

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ నాయకులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం పతనం అయిన తర్వాత తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకపోయినప్పటికీ స్వయం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం 115 స్థానాలు కాగా ప్రస్తుత రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందితే కర్ణాటక అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం అధికారం చేపట్టడానికి 116 స్థానాలు అవసరం ఉంటుంది. దీంతో కేవలం ఒక్క ఎమ్మెల్యే బీజేపీలో చేరితే చాలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి లైన్‌ క్లియర్ అయినట్లే అని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories