Karnataka High Court: విద్యా సంస్థల్లో హిజాబ్ వద్దు

Karnataka High Court Judgment on hijab | Telugu News
x

Karnataka High Court: విద్యా సంస్థల్లో హిజాబ్ వద్దు

Highlights

Karnataka High Court: ఖురాన్ లోనూ తప్పనిసరి చేయలేదు

Karnataka High Court: హిజాబ్ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యా సంస్ధల్లో యూనిఫామ్ నిబంధనలను పాటించాలన్న కర్ణాటక సర్కార్ ఆదేశాన్ని సమర్థించింది. అంతేకాదు విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్ పై ఆదేలిచ్చే అధికారం సర్కారుకు ఉందని విస్పష్టంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని అధికరణలు, ప్రస్తావించిన మౌలిక హక్కులకు అనుగుణంగానే ప్రభుత్వం ఆదేలిచ్చినట్లు తెలియజేసింది.

విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలను ప్రశ్నించే హక్కు లేదని సూచించిన కోర్టు ఈ వివాదంపై దాఖలైన ఇతర పిటిషన్లు హేతుబద్దంగా లేవంటూ కొట్టేసింది. వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై దాఖలైన ఇతర పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పును ఓ విద్యార్థిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాజ్యాంగ అధికరణం 21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోకి హిజాబ్ వస్తుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories