Facebook: భారత్‌లో ఫేస్‌బుక్‌ మూసివేయాలని కర్ణాటక హైకోర్టు హెచ్చరిక

Karnataka HC Warns Facebook of Shutting Down its India
x

Facebook: భారత్‌లో ఫేస్‌బుక్‌ మూసివేయాలని కర్ణాటక హైకోర్టు హెచ్చరిక

Highlights

Facebook: సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తి.. కేసు విషయంలో హైకోర్ట్‌ కీలక వ్యాఖ్యలు

Facebook: అడిగిన సమాచారం ఇవ్వకపోతే భారత్‌లో ఫేస్‌బుక్‌ సేవలను నిలిపివేయాల్సి ఉంటుందని కర్ణాటక హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ నిమిత్తం ఫేస్‌బుక్‌ అడిగిన సమాచారం ఇవ్వకపోతే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. తాజాగా సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసు విషయంలో హైకోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. స్థానిక పోలీసులకు సహకరించని కారణంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.సౌదీ అరేబియాలోని ఓ సంస్థలో పనిచేసే శైలేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 2019 ఏడాదిలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్ సీకి అనుకూలంగా ఓ పోస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత శైలేశ్‌ పేరుతో ఎవరో వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను ఓపెన్‌ చేశారు.

అనంతరం ఆ ఖాతా నుంచి సౌదీ అరేబియా దేశంపై అభ్యంతకర పోస్టులు చేశారు. దీంతో స్పందించిన అక్కడి ప్రభుత్వం శైలేశ్‌ను అరెస్ట్ చేసింది. ఈ విషయమై ఆయన భార్య తాజాగా మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తమకు అవసరమైన సమాచారం అందించాని ఫేస్‌బుక్‌కు లెటర్‌ రాశారు. అయితే ఫేస్‌బుక్‌ యాజమాన్యం నుంచి ఎలాంటి బదులు రాలేదు. విచారణ ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో శైలేశ్‌ భార్య పోలీసులను ఆశ్రయించింది.ఇందులో భాగంగానే విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు.. కేసు విచారణకు అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఫేస్ బుక్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఫేస్‌బుక్‌ను భారత్‌లో నిలిపివేస్తామని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories