coronavirus: కర్ణాటక కీలక నిర్ణయం

coronavirus: కర్ణాటక కీలక నిర్ణయం
x
Highlights

కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వైరస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కర్ణాటకకు వస్తే తప్పనిసరిగా ఏడు రోజులపాటు ఉండేలా షరతు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్వారంటైన్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు కర్ణాటకకు రావాలంటే ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరురాష్ట్రాల్లోనే ఏకంగా 80 శాతం కరోనా కేసులున్నాయి.

ఈ కారణంతోనే ఆ రాష్ట్రాలను నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి శుక్రవారం ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు వైరస్‌ నెగటివ్‌ వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌ లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే తక్కువ వైరస్‌ కేసులున్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారు 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories