KS Eshwarappa: మసీదులపై కర్ణాటక మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karnataka Ex Minister Eshwarappa Vows to ‘Reclaim’ 36,000 Temples
x

KS Eshwarappa: మసీదులపై కర్ణాటక మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Highlights

KS Eshwarappa: దేశవ్యాపత్ంగా 36వేల ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులను నిర్మించారని ఆరోపించిన ఈశ్వరప్ప

KS Eshwarappa: మసీదుల్లో మందిరాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కర్ణాటక మాజీ కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలను ధ్వంసం చేసి వాటి పునాదులపై మసీదులను కట్టారని వాటిని పునరుద్ధరించి తీరుతామన్నారు. ఎక్కడైనా మసీదులను కట్టి నమాజులు చేసుకోండి ఆలయాల మీద నిర్మించిన మసీదుల్లోకి అనుమతించేతి లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 36వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించినట్టు వెల్లడించారు. ఆయా స్థలాలను న్యాయపోరాటంలో చేజిక్కించుకుని ఆలయాలను పునరుద్ధరించడం ఖాయమని ఈశ్వరప్ప వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది.

యూపీలోని వారణాసిలో కాశీ విశ్వేశ్వర ఆలయానికి అనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులోనూ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయంటూ ఐదుగురు మహిళలు కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జ్ఞానవాపిలో వీడియో సర్వేను మసీదు కమిటీ వ్యతిరేకించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా కేసును వారణాసి కోర్టుకే బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు 30కి వాయిదా పడింది. తాజాగా కర్ణాటకలోనూ మంగళూరు వద్ద ఓ పాత మసీదులో మరమ్మతు పనులు జరుగుతుండగా హిందూ ఆలయ నమూనాలు వెలుగుచూశాయి. దీంతో పనులను నిలిపేయాలంటూ విశ్వహిందూ పరిషత్‌ నేతలు అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప వ్యాఖ్యలు మరో వర్గంలో ఆందోళన రేకెత్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories