కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్
x
Highlights

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న డీకే నుంచి సరైన సమాధానం...

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న డీకే నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈడీ అరెస్ట్ చేసింది. కాగా శివకుమార్‌ను ఈడీ అధికారులు బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. అలాగే తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఈడీ కోరనుంది. ఈ కేసుకు సంబంధించి నాలుగు రోజులుగా ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో పన్ను ఎగవేత, హవాలా ఆరోపణలపై ఈడీ అధికారులు శివకుమార్‌తోపాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories