Yediyurappa: మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు

Karnataka CM Yediyurappa Meets BJP Chief JP Nadda
x

జేపీ నడ్డాను కలసిన సీఎం యెడియూరప్ప (ఫైల్ ఇమేజ్)

Highlights

Yediyurappa: నిన్న ప్రధాని మోడీతో భేటీ అయిన యడియూరప్ప * ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ

Yediyurappa: కర్ణాటక సీఎం యడియూరప్ప ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందని, సీఎం పదవికి యెడ్డీ రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపైనే నిన్న ప్రధాని మోడీతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పీఎంను కలిశానని ప్రకటించారు. అయితే ఇవాళ మరోసారి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం కీలక మలుపులు తిరుగుతోంది. అయితే తాను రాజీనామా చేయడం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చిన యెడియూరప్ప ఢిల్లీ టూర్‌లో మరికొంతమంది బీజేపీ నేతలను, కేంద్ర మంత్రులను కలుస్తానని తెలిపారు.

కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చర్చించేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చానని, ఆగస్టులో మరోసారి ఢిల్లీకి వస్తానని ఆయన పేర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్ షా. అమిత్ షా తో చర్చించానని తెలిపారు. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కూడా కలిసి చర్చించానని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామని యడియూరప్ప స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories