క‌ర్ణాట‌క క్యాబినెట్‌లో శాఖల కేటాయింపుపై మంత్రుల అసంతృప్తి

Karnataka Cabinet Ministers Who Expressed Dissatisfaction Over The Allocation of Departments on Chief Minister
x

క‌ర్ణాట‌క క్యాబినెట్‌ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* అప్పుడే క‌ర్ణాట‌క క్యాబినెట్‌లో లుక‌లుక‌లు! * క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌ను సంతోష‌పెట్టలేక‌పోయిన సీఎం

Karnataka Cabinet: క‌ర్ణాట‌క న్యూ క్యాబినెట్‌లో అప్పుడే లుకలుకలు మొదలైయ్యాయి. నూత‌న సీఎం బ‌స్వరాజ్ ఎస్ బొమ్మై త‌న క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌ను సంతోష‌పెట్టలేక‌పోయారు. ఆనంద్‌సింగ్ త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఆయ‌న‌కు టూరిజం, ఎకాల‌జీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల‌ను బ‌స్వరాజ్ ఎస్ బొమ్మై కేటాయించారు.

త‌న‌కు ఈ శాఖ‌లు కేటాయించాల‌ని కోర‌లేద‌న్నారు. పార్టీ ప్రతినిధిగా దీనిపై బ‌హిరంగ వ్యాఖ్య చేయ‌బోన‌న్నారు ఆనంద్ సింగ్‌. మ‌రోసారి సీఎం బ‌స్వరాజ్ బొమ్మైని క‌లిసి చ‌ర్చిస్తాన‌ని చెప్పారు. బ‌స్వరాజ్ ఎస్ బొమ్మై త‌న క్యాబినెట్‌లోకి తీసుకున్న ఆనంద్ సింగ్‌ గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా.. 2019లో కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ కుప్పకూల‌డంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories