
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం పాటించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారాల లాక్డౌన్ ను పిలుపునిచ్చారు.
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం పాటించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారాల లాక్డౌన్ ను పిలుపునిచ్చారు.దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది, అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు మాత్రం ఇదేమి పట్టలేదు. బాధ్యత మరచి తన జన్మదిన వేడుకలు చేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రం తురువకేర్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఎం. జయరామ్ శుక్రవారం గుబ్బి తాలూకాలో పలువురు గ్రామస్తులతో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో జన్మదిన వేడుకలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
అసలే ప్రజలు గుమికూడకూడదు అని ప్రభుత్వాలు, వైద్యనిపుణులు మొత్తుకొని చెబుతున్నా.. ఈ ఎమ్మెల్యే మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘనలు చేశారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.. కాగా లాక్డౌన్ ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు బొక్క అవుతోన్న సంగతి తెలిసిందే.
ఒక్క ఉత్తరాఖండ్‌లోనే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 4500 మందికి పైగా శుక్రవారం వరకు అరెస్టయ్యారు. ఇదిలావుంటే దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,761 కు చేరుకుంది, వీటిలో 6039 క్రియాశీల కేసులు ఉండగా, 516 మందికి నయం అయింది.. 206 మరణాలు నమోదయ్యాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



