కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. హస్తం పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా..

Kapil Sibal Resigns From Congress | Telugu News
x

నేడు మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

Highlights

సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కపిల్‌ సిబల్‌

Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హస్తం పార్టీకి మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సమక్షంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. త్వరలో సమాజ్‌వాదీ పార్టీలో కపిల్‌ సిబల్‌ చేరనున్నారు.

మే 16న కాంగ్రెస్‌కు రిజైన్ లెటర్ ఇచ్చినట్లు కపిల్ సిబల్ తెలిపారు. మొన్న గుజరాత్‌లో హార్దిక్ పటేల్, నిన్న పంజాబ్‌లో మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పగా.. ఇవాళ మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories