నా మేనమామ వేధిస్తున్నాడు : ప్రముఖ నటి

నా మేనమామ వేధిస్తున్నాడు : ప్రముఖ నటి
x
Highlights

నా మేనమామ వేధిస్తున్నాడు : ప్రముఖ నటి నా మేనమామ వేధిస్తున్నాడు : ప్రముఖ నటి

ఆస్తికోసం.. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని మేనమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రముఖ నటి జయశ్రీ రామయ్య. బుధవారం కర్ణాటక రాష్ట్రం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం జయశ్రీ మాట్లాడారు. తన తల్లి తండ్రులకు చెందిన ఆస్తిని కాజేసేందుకు మేనమామ గిరీష్ కుట్రపన్నారని.. తనతో పాటు

తన తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపించారు. తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని ఆరోపించారు. అలాగే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీష్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories