Kamal Haasan: కమల్ ఆస్థి విలువ 176.93 కోట్లు

Kamal Hasaan Total Property
x

కమలహాసన్ఫై: (ఫైల్ ఇమేజ్)

Highlights

Kamal Haasan: ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 176.93 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు.

Kamal Haasan: తమిళనాడులో జరుగుతున్నఎన్నికల్లో మొదటి సారి కమల్ హాసన్ కూడా బరిలోకి దిగబోతున్నాడు. యాక్టర్ గా, హోస్ట్ గా విశేష ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న కమల్..రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాడా అని అంత ఎదురుచూస్తున్నారు. ఎమ్ఎన్ఎమ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యే గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అక్కడి నుంచి తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసారు.

ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.176.93 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. అందులో స్థిరాస్తులు రూ.131.84 కోట్లు.. చరాస్థులు రూ. 45.09 కోట్లుగా పేర్కొన్నారు. ఇక లండన్‌లో రూ. 2.50 విలువ చేసే ఇల్లు.. రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. 234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories