కాఫిడే యజమాని వీజీ సిద్ధార్థ ఆత్మహత్య

కాఫిడే యజమాని వీజీ సిద్ధార్థ ఆత్మహత్య
x
Highlights

కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మిస్సింగ్‌ ట్రాజిడిగా మారింది.రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు...

కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మిస్సింగ్‌ ట్రాజిడిగా మారింది.రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాం లభించింది. సుమారు 300మందికిపైగా గజ ఈతగాళ్లు జల్లెటపట్టారు. దాదాపు 36 గంటల గాలింపు తర్వాత తెల్లవారుజామున సిద్ధార్థ మృతదేహాన్ని బయటకు తీశారు.

వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిద్ధార్థ రెండ్రోజుల క్రితం ఓ లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ కింగ్‌గా గుర్తింపు సాధించిన వీజీ సిద్ధార్థ మరణంతో కర్ణాటకలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కాఫీ డే సిబ్బంది శోఖసంద్రంలో మునిగిపోయారు.

ఈ క్రమంలో ఉద్యోగులు, సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు సిద్ధార్థ రాసిన లేఖ బయటపడింది. అనుకున్న విజయాన్ని సాధించలేకపోవడంతో పాటు ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్‌ వేధించారంటూ లేఖలో వెల్లడించడం సంచలనంగా మారింది. కంపెనీల నష్టాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు లేఖలో వెల్లడించారు. ఎన్నో ఆశలతో కాఫీడే సామ్రాజ్యాన్ని స్థాపించినని... అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నానని లేఖలో తెలిపారు.

1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో 'కేఫ్ కాఫీ డే'ను ప్రారంభించిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే 'కేఫ్‌ కాఫీ డే' ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా తీర్చి దిద్దారు.కెఫే కాఫీ డే ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా 1750 కెఫేలు ఉండగా.. మలేసియా, నేపాల్, ఈజిఫ్టులో కూడా అవుట్ లెట్లు ఉన్నాయి.తన సంస్థల్లో సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories