మరోసారి కాంగ్రెస్‌కు రంగుపడింది.. కేంద్ర క్యాబినెట్ లోకి సింధియా..?

మరోసారి కాంగ్రెస్‌కు రంగుపడింది.. కేంద్ర క్యాబినెట్ లోకి సింధియా..?
x
Highlights

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా...

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. 15 నెలల కమలనాథ్‌ సర్కారు పతనం అంచున ఉంది. కర్ణాటకలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్- జేడీఎస్ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా సింధియా పార్టీని వీడటంతో ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపితే.. మరికొందరు వేరే బీజేపీ ఎమ్మెల్యేలతో పంపించారు. అనంతరం అక్కడ్నుంచి హర్యానాకు క్యాంప్ మార్చారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు.

దీంతో ఈ ఆరుగురు మంత్రుల్ని తమ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. అంతేకాదు, వీరిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ గవర్నర్‌కు కూడా లేఖ రాశారు. అయితే ఈ మంత్రులు మాత్రం తాము పార్టీనే వీడాలని నిర్ణయించుకున్నప్పుడు తొలగిస్తే ఏంటి తొలగించకుంటే ఏంటి అని సమాధానమిస్తున్నారు.

మంగళవారం మీడియాతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి మాట్లాడారు.. విధానసభ మార్గదర్శకాల ప్రకారం రాజీనామాలను అంగీకరించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను హోలీ సెలవులో ఉన్నానని.. మార్చి 12 వరకు లక్నోలోనే ఉంటానని.. భోపాల్‌లోని రాజ్ భవన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ప్రస్తుత పరిణామాలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తూ పెద్ద షాక్ ఇచ్చిన జ్యోతిరాదిత్య.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీని కలిసి.. తాను పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రధానితో భేటీ తర్వాతే.. సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలావుంటే.. జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఆయనను పార్టీ బహిష్కరించిందని, దీనికి సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ స్పష్టం చేసింది.

జ్యోతిరాదిత్య సింధియాను ఈ దఫా రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. రాజ్యసభకు పంపి కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని మోదీ, అమిత్ షా నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావలసి ఉందని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. jyotiraditya scindia resigns congress and crisis madhya pradesh

Show Full Article
Print Article
More On
Next Story
More Stories