జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి

జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
x
Highlights

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.మురళీధర్ ఆక్ష్మిక బదిలీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు ప్రతిపక్షనేతలు.. అయితే ఈ విమర్శలకు కౌంటర్...

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.మురళీధర్ ఆక్ష్మిక బదిలీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు ప్రతిపక్షనేతలు.. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఫిబ్రవరి 12 న తన బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు స్పష్టం చేశారు. న్యాయమూర్తి బదిలీ విషయంలో వారి సమ్మతి కూడా కొలీజియం తీసుకుంటుందని చెప్పారు.

ఈ సమస్యను రాజకీయం చేయడం ద్వారా, కాంగ్రెస్ మరోసారి న్యాయవ్యవస్థ పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించిందని దుయ్యబట్టారు. భారత ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అయినా.. అన్ని సంస్థలపై నిరంతరం దాడి చేసి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అలాగే జస్టిస్ లోయా కేసును సుప్రీంకోర్టులో విచారించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనిని ప్రశ్నించడం ద్వారా కొంతమంది న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారు. ఈ విషయం సుప్రీంకోర్టులో విస్తృతంగా చర్చించబడింది. రాహుల్ గాంధీ తనను తాను సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా భావిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.

అయితే దీనికి ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విలేకరుల సమావేశంలో జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీపై ప్రశ్నలు సంధించారు.

వాటిలో..

*బీజేపీ నాయకులను స్వతంత్రంగా మరియు నిష్పాక్షికంగా విచారిస్తే, ఢిల్లీలో హింస, భీభత్సం మరియు గందరగోళంలో మీ సహకారం బహిర్గతమవుతుందని మీరు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు..

*అలాగే న్యాయమైన మరియు సమర్థవంతమైన న్యాయాన్ని నిరోధించడానికి మీరు ఎంత మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తారు? అని అన్నారు.

*మీ స్వంత పార్టీ నాయకులు చేసిన విషపూరిత ప్రకటనలను సమర్థించటానికి మీకు మార్గం లేదు, కాబట్టి మీ పార్టీ నాయకులను విచారించమని పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తిని మీరు బదిలీ చేస్తారా? అంటూ ప్రశ్నలు సంధించారు.

జస్టిస్ మురళీధర్ బదిలీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా స్పందించారు, ప్రభుత్వం న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని వారు ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories