జర్నలిస్టులూ ఫ్రంట్‌లైన్ వర్కర్లే: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

Joint Secretary Lav Agarwal Says Journalists are also Identified as Frontline Workers
x

జర్నలిస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Frontline Workers: జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని అన్నారు

Frontline Workers: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ రూల్స్ పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు కోవిడ్ రూల్స్ పాటిస్తూ.. కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని లవ్ అగర్వాల్ సూచించారు.

12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని అన్నారు. 18 నుంచి 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి ఇప్పటి వరకు టీకాలు అందాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా బయట తిరగొద్దని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories