Job Alert: పోస్టాఫీసుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Job Alert: పోస్టాఫీసుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
x
Highlights

Job Alert:AP, TS లలో పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కి నోటిఫికే షన్

Job Alert:దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరి 26 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://appost.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల్ని మాత్రమే స్వీకరిస్తోంది ఇండియా పోస్ట్. ఫిజికల్ అప్లికేషన్లను స్వీకరించేట్లేదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ మొత్తం చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు 1150 ఉండగా అందులో జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, PWD-A- 9, PWD-B- 14, PWD-C- 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించారు.

విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి. స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి

దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థి వయస్సు 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనాల వివరాలు చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు. ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.

పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది. అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

మూడో స్టెప్‌లో పోస్టు ఎంచుకోవాలి. మూడు స్టెప్స్ పూర్తైన తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories