7 లక్షల పోస్టులు ఖాళీ‎ : కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్

కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్
x
కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్
Highlights

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 7 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు సమాచారం అందించారు.

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 7 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు సమాచారం అందించారు. షెడ్యూల్డ్ కులాలు, ఓబీసీ, అలాగే బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభకు అందించిన వివరాలప్రకారం గ్రూప్ ఏలో 19వేల 896పోస్టులు, గ్రూప్ బీలో 89,638 పోస్టులు, గ్రూప్ సీలో 5లక్షల 74వేల 289 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు.

2019-20 ఏడాదికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు అందించిన సమాచారం ప్రకారం 1, 05,338 భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టులను‎ సీఈఎన్‌ కింద రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్‌ఆర్‌బీ ద్వారా 1,27,573 పోస్టుల భర్తీ కోసం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో మరిన్ని పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్ సీ, లెవల్ -1లో 1,56,138 పోస్టులు భర్తీకి సీఈ నోటిఫికేషన్లను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్ఆర్బీ, సీఈఎన్‌ల ద్వారా ఖాళీల నియామక ప్రక్రియ జరుగుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. 2019 ఓబీసీలకు 1,773 బ్యాక్‌లాగ్, 1,713 (ఎస్‌సీ)బ్యాక్‌లాగ్, ఎస్టీలకు 2,530 బ్యాక్‌లాగ్ ఖాళీలల్లో నియామకాలు చేపట్టలేదని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories