మహాకూటమికి షాక్.. ఎన్డీఏలోకి మరో పార్టీ

మహాకూటమికి షాక్.. ఎన్డీఏలోకి మరో పార్టీ
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మాంజి నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీ సెప్టెంబర్ 3 న ఎన్డీఏలో చేరే..

మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మాంజి నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీ సెప్టెంబర్ 3 న ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. బీహార్ లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాంజి పార్టీకి పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మాంజిని ఎన్డీఏ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీహార్ లో రాజ్యసభ సీటు ఖాళీ అయిన వెంటనే జెడియు కోటా నుంచి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాంజీ పార్టీ వైదొలగటం మహా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. నిన్నమొన్నటివరకు మహాకూటమిలో ఉన్న మాంజీ పార్టీ ఆర్జేడీని వ్యతిరేకించి బయటకు వచ్చింది.

ఆర్జేడీ ఆధిపత్యం చెలాయిస్తుందని మిగతా పార్టీలకు అంతగా ప్రాధాన్యం లేకుండా పోతుందని మాంజీ పార్టీ వ్యతిరేకించింది. బీహార్ లో దళిత నేతగా మాంజీకి గుర్తింపు ఉంది. ఒక సంవత్సరం పాటు బీహార్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదిలావుంటే తేజశ్వి యాదవ్‌ను మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది. ఈ నిర్ణయం ఇతర పార్టీలకు నచ్చలేదు. ఈ క్రమంలో ఏడుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు, 5 లెజిస్లేటివ్ కౌన్సిలర్లు జెడియులో చేరారు. మరోవైపు జెడియు ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్యామ్ రాజక్ స్వదేశానికి తిరిగి ఆర్జెడికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories