Jio Smart Phones: జియో నుంచి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్...

Jio Smart Phones: జియో నుంచి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్...
x
Highlights

Jio Smart Phones | దేశీయ టెలికాం మార్కెట్లో జియోను తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లపై దృష్టి వెట్టారు.

Jio Smart Phones | దేశీయ టెలికాం మార్కెట్లో జియోను తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లపై దృష్టి వెట్టారు. అందరికీ అందుబాటులో ఉండేలా రూ.4000 వేలకే స్మార్ట్ ఫోన్లను అందించేందుకు సిద్దమవుతున్నారు. భారత్ లో పాగా వేసిన షావోమి లాంటి చైనా బ్రాండ్లకు పోతీనిస్తూ లోకల్ బ్రాండ్లైన లావా, కర్బోన్ వంతో సంస్థలతో 20 కోట్ల ఫోన్ల ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.

గత జులైలో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశంలో జియో గ్లాస్, మిషన్ అన్న సేవ, వంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్‌ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని తెలిపిన విషయం తెలిసిందే. 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించింది అని,. గత ఏజీఎంలో చెప్పినట్లుగానే రిలయన్స్‌ నికర రుణ రహిత సంస్థగా మారిందని సంతోషంగా చెబుతున్నా. దీంతోపాటు భారత్‌లో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూని కూడా పూర్తి చేశాం అని, మేము 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేయగలమని నమ్ముతున్నానని అని తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే, గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. ఇక కన్జ్యూమర్‌ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందన్నారు. జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని, ఇది ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు అందిస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories