Spectrum Auction: ముగిసిన స్పెక్ట్రమ్ వేలం: రిలయెన్స్ జియో టాప్

Jio buys 4G spectrum worth Rs 57,122 crore
x

spectrum (ఫోటో హన్స్ ఇండియా)

Highlights

Spectrum Auction: దేశంలో 5 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్ వేలం మంగళవారం జరిగింది. మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.

Spectrum Auction 2021: దేశంలో 5 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్ వేలం మంగళవారం జరిగింది. స్పెక్ట్రమ్‌ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్‌ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. ఇక, రిలయన్స్ జియో ప్రధాన పోటీదారైన ఎయిర్‌‌టెల్‌ రూ. 18వేల 669కోట్లకు మాత్రమే బిడ్ వేసింది. మరోవైపు, వొడాఫోన్‌-ఐడియా కేవలం రూ.1993కోట్లకు బిడ్స్ దాఖలు చేసింది. వీటిలో అత్యధికంగా రిలయన్స్‌ జియో దక్కించుకుంది. ప్రస్తుతం దాఖలైన బిడ్స్ ప్రకారం.... కేంద్రానికి రూ. 77వేల 814కోట్ల ఆదాయం రానుంది.

రూ.18,669 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ ను దక్కించుకున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. సబ్‌ గిగా హెర్జ్ట్‌ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్‌ బ్యాండ్‌‌, 2300 మెగాహెర్జ్ట్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని తెలిపింది. కొత్తగా 9 కోట్ల మంది సబ్‌ స్క్రైబర్స్ ను చేర్చుకోనున్నామని పేర్కొంది. అలాగే ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్‌వర్క్‌ చొచ్చుకువెళ్లేందుకు అవకాశం లభించినట్లు తెలిపింది. ధరలు అధికంగా ఉండడం వల్లే 700 మెగా హెర్జ్ట్‌ బ్యాండ్‌కు ఎవరూ బిడ్‌లు దాఖలు చేయలేదని పేర్కొంది.

మరోవైపు, ఐదు సర్కిళ్లలో తాము దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ 4జీ కవరేజ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేయనుందని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌) పేర్కొంది. దీంతో మరింత నాణ్యమైన డిజిటల్‌ సేవల్ని అందించడంతోపాటు బిజినెస్ పెరిగే అవకాశం లభించనుందని పేర్కొంది. ఒకప్పుడు స్పెక్ట్రమ్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌ ఇప్పుడు మిగులు దేశంగా అవతరించిందని తెలిపింది. దీని వెనుక ప్రభుత్వ కృషి ఉందని కొనియాడింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా లక్ష్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని తెలిపింది. ఈ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు వినియోగించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories