ఎగ్జిట్‌పోల్స్‌: జార్ఖండ్‌లో ఆ పార్టీకి పెద్ద షాక్

ఎగ్జిట్‌పోల్స్‌: జార్ఖండ్‌లో ఆ పార్టీకి పెద్ద షాక్
x
jharkhand exit poll
Highlights

జార్ఖండ్‌ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. జార్ఖండ్ లో మరోసారి అధికారంలోకి రావాలనే కల బీజేపీ నెరవేరాలేదు....

జార్ఖండ్‌ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. జార్ఖండ్ లో మరోసారి అధికారంలోకి రావాలనే కల బీజేపీ నెరవేరాలేదు. జార్ఖండ్‌ లో ఐదు దశల అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారంతో ముగిశాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు ప్రకటించాయి. అయితే ఈ ఫలితాల్లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం జార్ఖండ్‌లో కాంగ్రెస్‌-జేఎంఎం కూటమికి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్ -జేఎంఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అంచాన వేస్తున్నాయి. మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం కానుందని, కాంగ్రెస్‌-జేఎంఎం 38-50 స్థానాలు సొంత చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని సర్వే సంస్థలు వెల్లడించాయి.

అయితే కొన్ని సంస్థలు హంగ్‌ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 42 సభ్యుల మద్దతు అవసరం. ఎగ్జిట్‌పోల్స్‌ పై స్పందించిన సీఎం రఘువర్‌ దాస్‌ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. జార్ఖండ్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories