జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే..

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే..
x
Jharkhand Congress
Highlights

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 47 స్థానాల్లో కైవసం చేసుకుంది. 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జేవీఎం 3, ఏన్‌‌జేఎస్‌యూ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సీఎం రఘుబర్ దాస్ ఓటమి పాలైయ్యారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ‍హేమంత్ సోరెన్ రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. సీఎం రఘుబర్ దాస్ తో సహా ఆరుగురు మంత్రులు స్పీకర్ ఓటమి పాలైయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి ఒంటరిగా పోటీ చేసింది. జార్ఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ ఏన్‌‌జేఎస్‌యూ కలిసి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తాజా ఎన్ని్కల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (31), జేఎంఎం (43) ఆర్జేడీ (7) కలిసి పోటీ చేశాయి. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలను ఈసీ నిర్వహించింది. సీఎం రఘుబర్ దాస్ బీజేపీ రెబల్ అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు.

2014తో పోలిస్తే విపక్షలు పుంజుకున్నాయి. 2014తో జేఎంఎం 19(30, 2019లో) , కాంగ్రెస్ 6, 16, 2019లో సాదించాయి. ఈ సారి బీజేపీ మాత్రం 12 స్థానాలు కోల్పోయి. 25 స్థానాలకు పరిమితమైంది. ఏన్‌‌జేఎస్‌యూ 5 నుంచి 2కి, జేవీఎం 8 నుంచి 3కు పడిపోయింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ట్విట్ చేశారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పరిపాలన అందిచాలని కోరుతున్నామని ట్వీట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. జార్ఖండ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ట్వీట్ చేశారు. జార్ఖండ్‌ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీని ఇప్పటి వరకు ఆదరించినందుకు జార్ఖండ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories