Top
logo

జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థల ప్రకటన

Jharkhand assembly pollsJharkhand assembly polls
Highlights

మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలగా ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనంది. తొలి దశ నామినేషన్‌ ప్రక్రియ నవంబర్‌ 13తో ముగియనుంది.

జార్ఖండ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలగా ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనంది. తొలి దశ నామినేషన్‌ ప్రక్రియ నవంబర్‌ 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్‌పుర్‌ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. చక్రంధర్‌పుర్‌ నియోజకవర్గం నుంచి జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలువా బరిలోకి దిగనున్నారు.

ఈ సందర్భంగా జార్ఖండ్ బీజేపీ జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తు్న్నామని తెలిపారు. 52నియోజక వర్గాలను అభ్యర్థులను ప్రటిస్తున్నట్లు‎గా వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాను సిద్ధం చేసింది. జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ రామేశ్వరం ఓరం లోహర్‌దంగా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు మొత్తం ఐదు విడతల్లో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాం‍గ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్‌ఎల్డీ కూటమి కలిసి పోటీ చేయనుంది. కూటమి తరపున సీఎం అభ్యర్థిగా హేమంత్‌ సోరెన్‌ను ఎన్నుకున్నారు.

Next Story