కరోనా పోరాట యోధులకు పుష్పాంజలి

కరోనా పోరాట యోధులకు పుష్పాంజలి
x
Highlights

కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పాత్ర ఎనలేనిది. కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్ కు కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు ముందుకుసాగాయి.

కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పాత్ర ఎనలేనిది. కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్ కు కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు ముందుకుసాగాయి. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించాయి. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకూ ఫైటర్ విమానాలైన సుఖోయ్ - 30, మిగ్ - 29, జాగ్వార్ తదితర విమానాలు, ఫైటర్ చాపర్లు ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఆకాశ పరేడ్ ను నిర్వహించాయి.

కొవిడ్ ఆసుపత్రిలపై యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో పరేడ్ చేస్తూ, పూలవర్షం కురిపించాయి. హైదరాబాద్ లోని గాంధీ ఆసుత్రిపై కూడా పూల వర్షం కురిపించాయి. విశాఖలోని కేజిహెచ్ పై కూడా పూల వర్షం కురిపించింది. వైద్యులకు పుష్పగుచ్ఛం ఇచ్చి నేవీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని పలు ఆసుపత్రులపై పూలవర్షం హెలికాప్టర్లు కురిపించాయి.

దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా వాయుసేన సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. 600 టన్నుల వైద్య పరికరాలను రవాణా చేయడంమే కాకుండా.. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని తమ ప్రాంతాల నుంచి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకు, టెస్టింగ్ ల్యాబ్ లకు చేర్చింది.



Show Full Article
Print Article
Next Story
More Stories