జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ పై 'ఈడీ' కేసు నమోదు

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ పై ఈడీ కేసు నమోదు
x
Highlights

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌పై ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసింది.

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌పై ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసింది. అలాగే దాడులు కూడా నిర్వహిస్తున్నట్లు వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేసు నమోదు చేసిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గోయల్‌ను కూడా ప్రశ్నించింది.

ముంబైకి చెందిన ట్రావెల్ కంపెనీని రూ .46 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో గోయల్, అతని భార్య అనితపై ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. దీంతో ఇండియన్ పీనల్ కోడ్ (ipc) లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో కార్యాలయం ఉన్న అక్బర్ ట్రావెల్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రాజేంద్రన్ నెరుపరంబిల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయింది.

గత ఏడాది మార్చిలో జైట్ ఎయిర్‌వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన గోయల్, రుణదాతలు 25 సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థకు ఫైనాన్స్ చేస్తున్నారు. సదరు కంపెనీ 1994 నుండి జెట్ ఎయిర్‌వేస్‌తో వ్యాపారం చేస్తోంది. అయితే నిందితులు తమ సంస్థలో ఆర్థిక సంక్షోభాన్ని దాచిపెట్టారని, తమకు ఎలాంటి నష్టం జరగదని ట్రావెల్ ఏజెన్సీకి హామీ ఇచ్చారని ఫిర్యాదుదారుడు రాజేంద్రన్ చెప్పారు. ట్రావెల్ ఏజెన్సీ మాంచెస్టర్-ముంబై విమాన టిక్కెట్లను తక్కువ ధరలకు, నిందితుల హామీ మేరకు విక్రయించింది.

అయితే, జనవరి 2019 లో, కొన్ని జెట్ విమానాలను రద్దు చేశారు.. డబ్బులు చెల్లించాలని బలవంతం చేసినా చెల్లించలేదు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితిపై నిందితులు తమకు భరోసా ఇస్తూనే ఉన్నారని ఫిర్యాదుదారు చెప్పారు. అయినా బకాయిలను తిరిగి చెల్లించలేదు.. ట్రావెల్ కంపెనీ హామీల కారణంగా నష్టాలను చవిచూసిందని పేర్కొన్నారు. దాంతో జెట్ ఎయిర్‌వేస్ పై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

ఇదిలావుంటే గోయల్ ఆధీనంలో 19 ప్రైవేటు సంస్థల కంపెనీలు ఉన్నాయని ఈడీ పేర్కొంది, వాటిలో ఐదు విదేశాలలో ఉన్నాయని. అమ్మకం, పంపిణీ మరియు నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు చేసినట్టు అనుమానిస్తోంది. గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం మరియు ఇతరులపై ఫెమా ఉల్లంఘనల చట్టం కింద ఈడీ దాడులు చేసింది. కాగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్ 2019 ఏప్రిల్ 17 న తన కార్యకలాపాలను నిలిపివేయవలసిన సంగతి తేలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories