JEE Main 2026 Results Date: జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్ చేయాలి?


JEE Main 2026 Results Date: జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్ చేయాలి?
జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు సంఖ్యతో స్కోర్ కార్డు ఎలా చూడాలో తెలుసుకోండి.
జేఈఈ మెయిన్ 2026 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16లోపు ఫలితాలు ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు.
మొదటి విడత పరీక్షలకు సంబంధించిన తుది సమాధాన కీతో పాటు ఫలితాలను ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థులు అధికారిక జేఈఈ మెయిన్ మరియు పరీక్షల నిర్వహణ సంస్థ వెబ్‌సైట్లలో తమ ఫలితాలు పరిశీలించవచ్చు. దరఖాస్తు సంఖ్య, జన్మతేదీ నమోదు చేసి స్కోర్ కార్డును పొందే వీలుంది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 29 వరకు తొలి విడత పరీక్షలు నిర్వహించారు. మొదటి ప్రశ్నాపత్రానికి దాదాపు 13 లక్షలకు పైగా మంది దరఖాస్తు చేసుకోగా, సుమారు 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. తాత్కాలిక సమాధాన కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది కీ, ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



