ప్రశాంత్‌ కిషోర్‌పై జేడీయూ వేటు

ప్రశాంత్‌ కిషోర్‌పై జేడీయూ వేటు
x
Highlights

ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త, జనతాదళ్‌(యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ కు ఆ పార్టీ ఉద్వాసన పలికింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా...

ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త, జనతాదళ్‌(యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ కు ఆ పార్టీ ఉద్వాసన పలికింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) విషయంలో పార్టీ వైఖరికి విరుద్ధంగా వ్యవహరించాడని ఆయన పై వేటు వేసింది సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న కిషోర్‌... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్‌ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మ విమర్శించారు. దీంతో వర్మ చేసిన విమర్శలకు సపోర్ట్ గా ప్రశాంత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్‌ పిలుపునిచ్చారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి అనుకున్నా.. వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఇకనుంచి వారిద్దరికీ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని పార్టీ వ్యాఖ్యానించింది. 'వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు.

పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు' అని సస్పెన్షన్ నోట్ లో పార్టీ పేర్కొంది. వీరి బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ఒక ప్రకటన విడుదల చేసింది జేడీ(యూ). ఇదిలావుంటే మంగళవారమే ప్రశాన్త కిషోర్ ను ఉద్ద్యేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నితీష్.. ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఫర్వాలేదు, వెళ్ళినా ఫర్వాలేదు అని వ్యాఖ్యానించారు. కిషోర్ వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారని చెప్పిన ఆయన.. 'నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను, అతను పార్టీలో కొనసాగాలని కోరుకుంటే పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణానికి కట్టుబడి ఉండాలి.. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రశాంత్ ను పార్టీలో చేర్చుకోవాలని నాకు చెప్పారు... ఆయన మనసులో ఏదో ఉండి ఉండాలి అని అన్నారు. 2018 లో, కిషోర్ ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించాం , ఆయనను రాజకీయాల "భవిష్యత్తు"' అని పేర్కొన్నారు నితీష్.. ప్రశాంత్ పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు బయలుదేరాలనుకుంటే వెళ్లొచ్చు అని ప్రశాంత్ కు సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories