అయోధ్య కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్

అయోధ్య కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్
x
Highlights

అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది.

అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. ఇటీవలే అయోధ్య విషయంతో జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలి సుప్రీంకోర్టు తెలిపింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం తెలిపింది. 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్‌కు ఇచ్చి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కోర్టు తెలిపింది. ప్రార్థనామందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందన్నారు సీజేఐ. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని తెలిపారు. బాబ్రీ మసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదని తెలిపారు.

అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జమైత్ ఉలేమా ఈ-హింద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ వేయడంపై ఆ సంస్థ చీఫ్‌ మౌలానా అర్షద్ మదాని మీడియాతో మాట్లాడారు.. దేశంలో ఎక్కువ శాతం మంది ముస్లీంలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కొందరూ మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతించారని, వారు మాత్రమే పిటిషన్ వద్దనుకుంటున్నారని వెల్లడించారు.

రివ్యూ పిటిషన్‌ దాఖలు తమ హక్కు అని మౌలానా అర్షద్ మదాని అన్నారు. రామమందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారనేది వివాదాస్పద అంశమని ఆయన పేర్కొన్నారు. ఆధారాలు లేవని కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించగా ఇప్పుడు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన తొలి పిటిషన్ మాత్రం ఇదే. అయోధ్య తీర్పుపై 99 శాతం ముస్లింలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని కోరుకుంటున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పేర్కొంది. డిసెంబర్‌ 9న రివ్యూ పిటిషన్‌ వేస్తామని ఆ సంస్థ తెలిపింది. అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు రివ్యూ పిటిషన్ వేయమని తేల్చిచెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories