జామియా ఘటన.. 10 మంది విద్యార్థులకు నోటీసులు

జామియా ఘటన.. 10 మంది విద్యార్థులకు నోటీసులు
x
Highlights

సిఎఎ వ్యతిరేక నిరసన సందర్భంగా డిసెంబర్ 15 న జరిగిన హింసకు సంబంధించి ప్రశ్నించేందుకు 10 మంది జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను తమ ముందు...

సిఎఎ వ్యతిరేక నిరసన సందర్భంగా డిసెంబర్ 15 న జరిగిన హింసకు సంబంధించి ప్రశ్నించేందుకు 10 మంది జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించి విద్యార్థులకు నోటీసులు అందజేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ విద్యార్థులలో సంఘటన జరిగిన రాత్రి అదుపులోకి తీసుకున్న వారిలో కొందరు, ఇటీవల బయటపడిన సిసిటివి వీడియో క్లిప్‌ల ద్వారా కొందరు, ఆ రోజు గాయపడిన వారిలో కొందరు ఉన్నారు.

మంగళవారం, డిప్యూటీ కమిషనర్ (క్రైమ్) రాజేష్ డియో నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ బృందంలోని మరికొందరు డిసెంబర్ 15 తర్వాత మొదటిసారి క్యాంపస్‌ను సందర్శించారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసు చర్యలో మొహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్థి కన్నుకు గాయమైంది ఆ విద్యార్థితో పోలీసులు మాట్లాడారు. ఇదిలావుండగా, పోలీసుల చర్య వల్ల జరిగిన ఆస్తికి నష్టాన్ని అంచనా వేస్తూ విశ్వవిద్యాలయ పరిపాలన మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

సుమారు 2.66 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు హెచ్‌ఆర్‌డి పేర్కొంది. ఇందులో లైబ్రరీలకు ఎక్కువ నష్టం జరిగింది. సిసిటివి కెమెరాలకు, ట్యూబ్‌లైట్లు, ఎసి యూనిట్లు, తలుపులు, గాజు కిటికీలు మరియు లైబ్రరీ టేబుల్స్ దెబ్బతిన్నాయని ఆరోపించారు. అనుమతి లేకుండా క్యాంపస్ లోపల పోలీసులు మోహరించడం వల్ల ఇది జరిగిందని పేర్కొంది. కొత్త రీడింగ్ బ్లాక్‌లో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని, కొద్ది రోజుల్లో ఇది విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వర్సిటీ అధికారి తెలిపారు.

ఈ సంఘటన గురించి ఇప్పటికే నాలుగు వీడియోలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి, తాజాది సోమవారం. ఆదివారం వెలువడిన ఒక వీడియోలో, పారామిలటరీ మరియు పోలీసు సిబ్బంది లైబ్రరీలో విద్యార్థులను కొట్టే ఘటన బయటకు వచ్చింది. మరో రెండు వీడియోలు, ముసుగులు ధరించి కొంతమంది యువకులను లైబ్రరీలోకి ప్రవేశించినట్లు కనిపించింది. ఈ వీడియోలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories