రాజస్థాన్‌లోని జైపూర్‌లో క్యాసినో దందా

Jaipur Casino Raid In Rajasthan
x

రాజస్థాన్‌లోని జైపూర్‌లో క్యాసినో దందా 

Highlights

Jaipur Casino Raid: ఓ ఇంట్లో క్యాసినో నిర్వహిస్తుండగా పోలీసుల సోదాలు

Jaipur Casino Raid: రాజస్థాన్‌లోని జైపూర్‌లో జోరుగా క్యాసినో పందాలు జరుగుతున్నాయి. జైసింగ్‌పురా ప్రాంతంలోని ఓ ఇంట్లో రహస్యంగా క్యాసినో జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు...క్యాసినో జరుగుతున్న ఇంటిపై రైడ్ చేశారు. క్యాసినో ఆడుతున్న 84 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 13మంది యువతులు కూడా ఉన్నారు.

క్యాసినో ఆటతో పాటు యువతుల అశ్లీల నృత్యాలు కూడా జరుగుతున్నాయని అడిషనల్ సీపీ అజయ్ పాల్ లాంబా తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పెద్ద ఎత్తున రప్పించి డ్యాన్సులు వేయిస్తున్నారని తెలిపారు. క్యాసినో పేరుతో అసాంఘీక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయన్న విషయం బయటపడిందన్నారు. సోదాల్లో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ సీపీ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories