జ్యోతికుమారి దైర్య సహసాలకి ఇవాంకా ట్రంప్‌ ఫిదా.. ఆసక్తికర ట్వీట్

జ్యోతికుమారి దైర్య సహసాలకి ఇవాంకా ట్రంప్‌ ఫిదా.. ఆసక్తికర ట్వీట్
x
Highlights

లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయన వలస కార్మికులు ప్రజారవాణా లేకపోవడంతో కాలినడకన తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు.

లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయన వలస కార్మికులు ప్రజారవాణా లేకపోవడంతో కాలినడకన తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే బీహార్ కి చెందిన జ్యోతికుమారి అనే ఓ పదిహేనేళ్ళ యువతీ తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సుమారు 1200 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన సాహసానికి దేశం మొత్తం ఇప్పుడు సలాం అంటుంది. ఆమె దైర్యానికి మెచ్చి భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎఫ్ఐ - సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆమెకు బంపరాఫర్ ఇచ్చింది. ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్ లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపింది.

అయితే ఈ ఘటన అమెరికా అధ్యక్షుడు స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్‌ను సైతం ఆకట్టుకుంది. జ్యోతికుమారి దైర్య సహసాలకి ఇవాంకా ట్రంప్‌ ఫిదా అయిపొయింది. ఈ సందర్భంగా త‌న మ‌న‌సులో మాట‌ను దాచుకోలేక‌పోయింది. జ్యోతిపైన ప్రశంశలు కురిపించంది. జ్యోతి చూపిన అద్భుత‌మైన‌ ఓర్పు, ప్రేమ.. భార‌తీయ ప్రజ‌ల‌ను, సైక్లింగ్ స‌మాఖ్యను క‌ట్టప‌డేసింద‌ని ఇవాంకా త‌న ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది.

బీహార్‌లోని దర్భంగాకు చెందిన జ్యోతికుమారి తండ్రి ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్ళాడు.. అక్కడ అద్దెకి రిక్షా తొక్కుతూ తన కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోవడం ఒక సమస్యగా మారితే పాపం అతనికి గాయాలు అవడం మరో ఇబ్బందిగా మారింది, దీనికి తోడు అద్దెకి ఇంటి యజమాని కూడా ఇబ్బంది పెట్టడంతో చేసేది ఏమీ లేకా రూ. 500 పెట్టి సైకిల్ కొనుక్కొని కూతురుతో కలిసి సొంత ఊరుకి పయనం అయ్యాడు.

తన తండ్రికి గాయాలుపాలు కావడంతో తన తండ్రిని వెనుక ఎక్కించుకొని జ్యోతి కుమారి 1200 కి.మీ సైకిల్ తొక్కింది. అలా వారం రోజుల తరవాత వీరు ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నా అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగిటివ్ రావడం విశేషం..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories