ఇవాంక ట్రంప్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

ఇవాంక ట్రంప్  స్పెషల్‌ ఎట్రాక్షన్‌
x
ఇవాంక ట్రంప్
Highlights

భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె..ఇవాంక ట్రంప్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది

భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె..ఇవాంక ట్రంప్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫ్లోరల్‌ డ్రెస్‌లో జిగేల్‌మని మెరిసిన ఆమె టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. ఇవాంకా ఎటు వెళ్లినా అందరి చూపులు ఆమెపైనే పడుతున్నాయి. అందరూ ఇవాంకా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ధరించిన డ్రస్ గురించి చర్చించుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఇవాంకా గురించే చర్చ జరుగుతోంది.

తాజ్‌ మహల్‌ పర్యటనలో కూడా ఇవాంకా మెరిసింది. తాజ్‌ మహల్‌ ముందు తన భర్తతో కలిసి ఫోటోలు దిగింది. తాజ్ అందాలకు ఫిదా అయింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్ తో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ఇప్పుడు వారిద్దరూ హాట్‌ టాపిక్‌గా మారారు. వారి డ్రస్సింగ్ స్టయిల్‌పై నెటిజన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు.

2017లో ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఆమె ప్రతి కదలికా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె ధరించిన డ్రెస్సుల గురించి విపరీతంగా చర్చ జరిగింది. వివిధ సందర్భాల్లో ఆమె ధరించిన దుస్తులు చర్చనీయాంశంగా మారాయి. ఇవాంకా ధరించిన దుస్తులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ముగ్ధమనోహరంగా ఉన్న ఇవాంకా అదిరిపోయే డ్రెస్సులతో మరింత అందంగా కనిపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories