Dheeraj Sahu: కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

IT Raids On Congress MP Dhiraj Sahu House
x

Dheeraj Sahu: కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

Highlights

Dheeraj Sahu: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బౌద్ధ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది.

Dheeraj Sahu: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బౌద్ధ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. ఐటీ అధికారులు ఇప్పటి వరకు 354 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ ధీరజ్‌ సాహు చెందిన ఇల్లు, కార్యాలయంలోనే కాకుండా తన విలాసవంతమైన నివాసాల గోడలపై కూడా రహస్య గుహలు సృష్టించి డబ్బు దాచి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోనున్నారు.

జియో సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా అతని ఇల్లు, కార్యాలయం, ఇతర ప్రదేశాల గోడలు, గ్రౌండ్‌ను కూడా పర్యవేక్షించనున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రం నేల, గోడలలో దాగి ఉన్న సంపదను గుర్తించగలదని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories