చెన్నైలో కొనసాగుతోన్న ఐటి దాడులు.. రూ. 30 కోట్లు, బంగారం స్వాధీనం?

చెన్నైలో కొనసాగుతోన్న ఐటి దాడులు.. రూ. 30 కోట్లు, బంగారం స్వాధీనం?
x
Highlights

చెన్నైలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటి దాడులు జరిగాయి. మాస్టర్ సినిమా లొకేషన్ లో నటుడు విజయ్ ను ఐటి అధికారులు ప్రశ్నించారు. బిగిల్ సినిమా లావాదేవీలపై...

చెన్నైలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటి దాడులు జరిగాయి. మాస్టర్ సినిమా లొకేషన్ లో నటుడు విజయ్ ను ఐటి అధికారులు ప్రశ్నించారు. బిగిల్ సినిమా లావాదేవీలపై విజయ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఏజిఎస్ కార్యాలయంలో రూ. 30 కోట్లు, బంగారాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏజిఎస్ సంస్థకు సమన్లు జారీ చేసింది ఐటి డిపార్ట్మెంట్. ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ నివాసంతో సహా 20 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయని ఐటి శాఖ వర్గాలు తెలిపాయి.

ఎజిఎస్ వ్యవస్థాపకుడు కల్పతి ఎస్ అఘోరం, అతని కార్యాలయ ప్రాంగణం మరియు నగరంలోని పలు కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయని ఐటి శాఖ తెలిపింది. కల్పతి గ్రూప్, ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎజిఎస్ సినిమాస్ ప్రమోటర్ అయిన కల్పతి అఘోరం 2016-2017 మధ్య తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్సిఎ) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పన్ను ఎగవేత ఫిర్యాదుల నేపథ్యంలో, ఐటి అధికారుల బృందాలు నిన్న(బుధవారం) ఉదయం నుండి నివాస మరియు వ్యాపార ప్రాంగణాలలో సోదాలు చేశారు.. ప్రస్తుతం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories