కల్కి ఆశ్రమంలో బయటపడుతున్న నగదు

కల్కి ఆశ్రమంలో బయటపడుతున్న నగదు
x
Highlights

-ఐటీ దాడుల్లో రూ.500కోట్ల కరెన్సీ పట్టివేత -వివిధ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న దాడులు -తమిళనాడు కల్కి ఆశ్రమంలో భారీగా సొమ్ము స్వాధీనం బయటిపడిన వజ్రాలు, బంగారం, దేశ, విదేశీ కరెన్సీ అయిదు కోట్ల విలువ చేసే వజ్రాలు -26 కోట్లు విలువచేసే 88 కేజీల బంగారం,40 కోట్ల నగదు,18 కోట్ల విదేశీ కరెన్సీ -93 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం -ఐటీ లెక్కలకు అందని రూ.409 కోట్లు

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అక్రమాస్తులపై జరిపిన ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు బయటపడింది. దాదాపు 500 కోట్ల దేశ , విదేశీ కరెన్సీని అధికారులు కనుగొన్నారు. తమిళనాడులోని కల్కి ఆశ్రమంతో సహా మరో 44 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏక కాలంలో జరిపిన దాడుల్లో ఆశ్చర్యం గొలిపే వివరాలు బయటపడ్డాయి.కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ కార్యాయంలో ఐటీ దాడులు జరిపిన అధికారులు నివ్వెరపోయారు.

భారీ ఎత్తున వజ్రాలు, బంగారం, స్వదేశీ,విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 కోట్లు విలువ చేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88కేజీల బంగారం,40 కోట్ల నగదుతో పాటూ 18 కోట్ల విదేశీ కరెన్సీ అధికారులకు దొరికింది. మొత్తం 93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 409 కోట్ల సొమ్ముకు అసలు లెక్కలేలేవని తెలుస్తోంది.చెన్నైలో ఎల్ ఐసీ ఏజెంట్ గా జీవితం మొదలు పెట్టిన విజయ్ కుమార్ నాయుడు తాను కల్కి భగవాన్ అవతారంగా ప్రకటించుకున్నారు. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకని ఆధ్యాత్మిక ప్రభోధాలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ఆశ్రమాలు తెరిచారు.. విదేశీ భక్తులను ఆకర్షించి వారి ద్వారా భారీ సొమ్మును విరాళాలుగా తీసుకున్నారు. అప్పటినుంచి వారి సంపాదనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories