Uttar Pradesh: యూపీలో మళ్లీ ఐటీ దాడులు

IT Raids Again in Uttar Pradesh | National News
x

యూపీలో మళ్లీ ఐటీ దాడులు

Highlights

Uttar Pradesh: తాజాగా వారణాసి, జాన్పూర్‌ జిల్లాల్లో తనిఖీలు

Uttar Pradesh: యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారణాసి, జాన్పూర్‌ జిల్లాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో బంగారు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో దాడులు నిర్వహించారు. ఆ బంగారు వ్యాపారులంతా సమాజ్‌వాదీ పార్టీ అనుకూలురు కావడం గమనార్హం.

రెండు జిల్లాలోని 8 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 50 మంది అధికారులు పాల్గొన్నారు. హవాలా మార్గంలో డబ్బును తరలించారన్న అనుమానాలతో ఈ దాడులు నిర్వహంచారు. గత డిసెంబర్‌లోనూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌కు అనుకూలంగా ఉండే అత్తరు వ్యాపారవేత్తల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి.. కోట్లాది రూపాయల నగదును పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories