logo
జాతీయం

కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు

కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
X
Highlights

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సోదరి.. కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడులోని...

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సోదరి.. కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడులోని తూత్తుకుడిలోని ఆమె ఇంట్లో సుమారు 10 మంది ఐటీ అధికారులు తనిఖీలు జరిపినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోకవర్గం నుంచి కనిమొళి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆమె ఇక్కడే నివాసం ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడుతలో ఒక్క సీటు వెల్లూరు లోక్‌సభ మినహా తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో 38 సీట్లలో ఈనెల 18న పోలింగ్ జరగనుంది.

Next Story