ISRO: ఇస్రో వందో ప్రయోగం రేపే...జీఎస్ఎల్ వీ-ఎఫ్ 15 కౌంట్ డౌన్ షురూ

ISRO: ఇస్రో వందో ప్రయోగం రేపే...జీఎస్ఎల్ వీ-ఎఫ్ 15 కౌంట్ డౌన్ షురూ
x
Highlights

ISRO: భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకునేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఈనెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన...

ISRO: భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకునేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఈనెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ ను రోదసిలోకి పంపించనుంది. దేశీయంగా రూపొందంచిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్ 02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ను మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు ప్రారంభించింది. 27గంటలపాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగింది. అంటే బుధవారం ఉదయం 6.23 గంటలకు షార్ లోని రెండో ల్యాంచ్ ఫ్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్ లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్ 02 ఉపగ్రహాన్ని జియో సింక్రొనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్త్రుతం కానుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా..ఎన్వీఎస్ 01 ఉపగ్రహాన్ని 29మే 2023న ఇస్రో నింగిలోకి పంపించింది. ఇది ఎన్వీఎస్ 02 ఉపగ్రహం ఎన్వీఎస్ సిరీస్ లో రెండో ఉపగ్రహం. ఎల్ 1, ఎల్ 5, ఎస్ బ్యాండ్ లలో నావిగేషన్ పేలోడ్లను అలాగే తొలితరం ఉపగ్రహం ఎన్వీఎస్ 01లో ఉన్నట్లుగానే సీబ్యాండ్ లో రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.

భారత భూభాగం నుంచి దాదాపు 1500కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు కచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశ్యం. కొత్త శాటిలైట్ తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో రూపొందించారు. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారాన్ని అందించాయి. జీఎల్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్ లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్ ఇది. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్ 02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories