ISRO: మరో భారీ ప్రయోగంపై ఇస్రో దృష్టి.. సూర్యునిపై అధ్యయనానికి ఆదిత్య - ఎల్ 1 ప్రయోగానికి సన్నాహాలు

ISRO To Launch Its First Solar Mission Aditya L1 To Study Sun
x

ISRO: మరో భారీ ప్రయోగంపై ఇస్రో దృష్టి.. సూర్యునిపై అధ్యయనానికి ఆదిత్య - ఎల్ 1 ప్రయోగానికి సన్నాహాలు 

Highlights

ISRO: అచ్చొచ్చిన వాహక నౌక పిఎస్ఎల్వి C-55 ద్వారా రోదసిలోకి ఆదిత్య- ఎల్1

ISRO: చంద్రయాన్- 3 విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో భారీ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.ప్రపంచం లో తొలిసారి జాబిల్లి పై దక్షిణం వైపు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్న ఇస్రో ఈసారి సూర్యునిపై గురిపెట్టింది. భానుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అనే పేరుతో ఇస్రో ఈ కీలక ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీహరికోటలోని షార్ నుండి పిఎస్ఎల్వి-C57 వాహక నౌక ద్వారా ఆదిత్య -L 1ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో రాకెట్ వేగం తో దూసుకు పోతుంది.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటికే జాబిల్లి రహస్యాలు చేదించేందుకు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. ఇదే ఉత్సాహంఉంతో సూర్యుని పై అధ్యయనం చేసేందుకు ఆదిత్య L-1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ మరోసారి వేదికైంది.ఇందులో అమర్చే ఉపగ్రహాన్ని ఇప్పటికే బెంగుళూరు నుండి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ మొదటి వారంలో పిఎస్ఎల్వి-C57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు..

ఆదిత్య- ఎల్1 కి సంభందించిన ఊహా ఉపగ్రహ చిత్రాలను ఇస్రో తమ సైట్లో పెట్టింది.సోషల్ మీడియా ద్వారా ఔత్సాహికులతో పంచుకుంది.ఆదిత్య - ఎల్1 ప్రాజెక్ట్ ప్రయోగం ద్వారా సూర్య గోళం లోని కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఇస్రో ముఖ్య ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతో కలిసి ఇస్రో సౌర అధ్యయన కోసం ఈ ప్రయోగం చేపట్టనుంది...

ఆదిత్య -L1 ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో అనేక విశేషాలు సూర్యగోళంపై ఆసక్తి రేకెత్తించే ఎన్నో రహస్యాలు వెలుగులోకి తేనుంది ఇస్రో. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. సుమారు 1500 కిలోల బరువున్న ఈ శాటిలైట్ సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో సూర్యుని ప్రభావం పై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు.భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాజ్ పాయింట్1(L1) చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సెక్షన్ లోకి ఉపగ్రహాన్ని పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.

ఆదిత్య ఎల్ వన్ లో మొత్తం 7 పెలోడ్లు నింగిలోకి మోసుకెళ్లనుంది, ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్(VELC)తో పాటు సోలార్ ఆల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్టరోమీటర్,హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్టరోమీటర్, మ్యాగ్నెట్ మీటర్ లను ఇందులో అమర్చనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఇందులో పేలోడ్ లను రూపొందించారు,ఈ పేలోడ్ లు ఎలక్ట్రో మాగ్నెటిక్,మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటో స్పియర్, క్రోమోస్ఫియర్,సూర్యుడు వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు ,సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి.గత నెల 14 న అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లికి మరింత చేరువైంది. అన్ని అనుకునేస్తే మరో వారం రోజుల్లో... అంటే ఆగస్టు 23 సాయంత్రం ఇది చంద్రుడి దక్షిణ భాగం పై ల్యాండ్ కానుంది, దీని తర్వాత కొన్ని రోజులు రోజుల్లోనే ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories