Gaganyaan: గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ISRO Ready For Gaganyaan Launch
x

Gaganyaan: గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో 

Highlights

Gaganyaan: శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం

Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. రాకెట్ ప్రయోగం గగన్యాన్కు వేగంగా అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి గగన్ యాన్ ఎక్స్ పె రిమెంటల్ తొలి ప్రయోగాన్ని శనివారం చేపట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ను ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దాదాపు 12 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం గగన్యాన్ ప్రయోగాత్మక రాకెట్టు నింగిలోకి దూసుకెళ్లనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాత్మకంగా చేపట్టే గగన్ యాన్ ప్రయోగానికి ప్రాథమికంగా అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగానికి వినియోగించే 44 టన్నుల బరువు గల ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్డు మిషన్-1 టీవీ-డీ1రాకెట్ షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై సిద్ధం చేశారు.అన్నీ సజావుగా సాగితే శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో నింగిలోకి రాకెట్ ను నింగిలోకి పంపి ఆపై నేలకు దించునున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రయోగాత్మకంగా జరగనున్న ఈ ప్రయోగం కేవలం 8 నిమిషాల్లో పూర్తయ్యేలా డిజైన్ చేశారు. రాకెట్ ను ఉన్న క్రూమా డ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచి పెడుతుంది. అనంతరం పారాచూట్ సాయంతో షార్ కు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం లో దిగుతుంది.. ఆ వెను వెంటనే నే నావికా దళ సిబ్బంధి వాటిని స్వాధీనం చేసుకొని ఒడ్డుకు చేరుస్తారు.ఈ రాకెట్ ను పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories