ISRO Aditya L1: సూర్యుడిపై పరిశోధన చేయనున్న ఇస్రో.. ప్రయోగానికి తేదీ ఖరారు

ISRO Ready For Another Key Launch
x

ISRO Aditya L1: సూర్యుడిపై పరిశోధన చేయనున్న ఇస్రో.. ప్రయోగానికి తేదీ ఖరారు

Highlights

ISRO Aditya L1: సెప్టెంబర్‌ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం

ISRO Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తొలిసారి సూర్యుడిపై పరిశోధనల కోసం అంతరిక్ష ప్రయోగం చేసేందుకు.. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగానికి తేదీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి రాకెట్ లాంఛ్ జరగనుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ కావడంతో.. ఇస్రో ఆపరేషన్ ఆదిత్యకు సిద్ధమైంది. ఈ మిషన్ ద్వారా పీఎస్ఎల్వీ c57 రాకెట్ ఉపయోగించి... సూర్యుడి సమీపానికి ఆదిత్య ఎల్‌1 ని ప్రయోగించనుంది. ఈ రాకెట్, శాటిలైట్ ఇప్పటికే బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకున్నాయి. ఇస్రో ఫ్లాగ్ షిప్ మిషన్ గా ఇది రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 15 వందల కోట్ల రూపాయలు. ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేసే కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ దగ్గర ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను కక్ష్యలో ఉంచనుంది ఇస్రో.

చంద్రయాన్ తరహాలోనే సూర్యయాన్ కూడా సాగనుంది. ఈ రాకెట్ ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాఫ్ట్ ను ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్లి వదులుతుంది. ఆ తరువాత ఆదిత్య ఎల్ 1 భూమి చుట్టూ తిరిగి....గ్రావిటేషనల్ ఫోర్స్ ను వాడుకుంటూ...మూమెంటమ్‌ను క్రియేట్ చేసుకొని సూర్యుడి చేరువలోకి వెళ్తుంది. సూర్యుడి ఆర్బిట్‌లో తిరుగుతూ....సూర్యుడి కరోనా చేరువకు చేరుకుంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ సూర్యుడి వాతావరణం చుట్టూ తిరుగుతూ.... వివిధరకాల కిరణాలు, సౌర తుపానులు లాంటి అంశాలను గ్రహిస్తూ ఆ వివరాలను ఇస్రోకు అందిస్తుంది. వాటిపై ఇస్రో మరింత పరిశోధన చేస్తుంది.

ఆదిత్య L1లో వివిధ ప్రయోగాల కోసం ఉద్దేశించిన పేలోడ్స్ కీలకంగా ఉన్నాయి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రయోగించే అంతరిక్ష నౌక మొత్తం ఏడు పే లోడ్స్ ను తీసుకెళ్తుంది. ఇవన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే. ఇవి ఫోటోస్పియర్, క్రొమోస్పియర్, సూర్యుడి బయటి పొరలను ఎలక్ట్రోమాగ్నటిక్, పార్టికల్, మాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్లను ఉపయోగించి పరిశీలిస్తాయి. కరోనల్ హీటింగ్, సోలార్ విండ్ యాక్సిలరేషన్, కరోనల్ మాగ్నెటోమెట్రీ, సమీపంలోని UV సోలార్ రేడియేషన్ పర్యవేక్షణ వంటి విభిన్న లక్ష్యాలతో మొత్తం 15 వందల కిలోల బరువైన ఏడు సైన్స్ పేలోడ్‌లను ఈ నౌక తీసుకువెళుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories