కఠిన పరీక్షను ఎదుర్కొబోతున్న ఇస్రో

కఠిన పరీక్షను ఎదుర్కొబోతున్న ఇస్రో
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ముందు ఇప్పుడో కఠినమైన సవాల్‌ ఉంది. వెయ్యి కోట్ల రూపాయలతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామ చివరి...

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ముందు ఇప్పుడో కఠినమైన సవాల్‌ ఉంది. వెయ్యి కోట్ల రూపాయలతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామ చివరి కక్ష్యలో ప్రస్తుతం పరిభ్రమిస్తోన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ మరికొన్ని గంటల్లో జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. చంద్రుడి దక్షిణధృవం వైపు దూసుకెళ్తోన్న ల్యాండర్ విక్రమ్‌ను సజావుగా దిగేలా చేయడమే ఇప్పుడు ఇస్రో ముందున్న సవాల్‌.

కఠిన పరీక్షను ఎదుర్కొబోతున్న ఇస్రో

జాబిలి చివరి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌

చంద్రుడిపై అడుగుపెట్టే క్షణాలే ఇప్పుడు కీలకం

ల్యాండర్‌ విక్రమ్‌ సురక్షితంగా దిగుతుందా?

ప్రయోగాన్ని సక్సెస్‌ చేసిన ఇస్రో ఈ సవాల్‌ను అధిగమిస్తుందా?

సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ల్యాండర్ విక్రమ్‌ను చందమామ దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగేలా చేయడమే ఇప్పుడు ఇస్రో ముందున్న అత్యంత సంక్లిష్ట దశ. చంద్రుడి ఉపరితలంపై ఎగుడు దిగుడు లేని ప్రదేశాన్ని ఎంచుకుని విక్రమ్‌ను ల్యాండ్ చేయించడమే ఇప్పుడు అసలు సిసలు సవాల్‌. వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న ఈ ల్యాండర్ వేగాన్ని సకాలంలో నియంత్రించాలి. ఒక్క సెకెను తేడా వచ్చినా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరక పోవచ్చు. దాని వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇస్రో తన లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు.

చందమామను అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది ఇస్రో. ఇప్పటిదాకా కొనసాగిన చంద్రయాన్-2 ప్రయాణం ఒక ఎత్తు కాగా సాఫ్ట్ ల్యాండింగ్ ఇంకో ఎత్తు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే ఫొటోలను బేరీజు వేసుకుని, ఎక్కడ ల్యాండ్ చేయించాలనే నిర్ణయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉన్న కొండ ప్రాంతాలు, అగాథాలు లేకుండా జాగ్రత్త పడాల్సింది ఇప్పుడే. ఉపరితలాన్ని మాత్రమే ఎంచుకొని, అప్పుడు ల్యాండింగ్ సజావుగా సాగుతుందని అంచనా వేయాలి. ఇది క్షణాల్లో జరిగిపోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా గమ్యాన్ని ముద్దాడటం గగనమే.

విక్రమ్ ల్యాండర్ ఈనెల 7న చంద్రుడి దక్షిణ ధృవం వైపు అడుగు పెట్టనుంది. అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:15 నిమిషాల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే అవకాశాలు ఉందటున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా ప్రయాణం సాగించడం, ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు తలెత్తకపోవడం వల్ల ల్యాండింగ్ కూడా విజయవంతమవుతుందని ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చివరి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అండాకారంలో ఉన్న చంద్రుడి కక్ష్యలో ఉపరితలానికి దగ్గరిగా 114 కిలోమీటర్లు, దూరానికి 125 కిలోమీటర్ల దూరంలో తిరుగుతుంది. అత్యంత క్లిష్టమైన దశగా భావిస్తున్న సాఫ్ట్ ల్యాండింగ్‌ను అధిగమిస్తే అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం అగ్రదేశాల సరసన నిలవడం ఎంత ‍ఖాయమో అంతర్జాతీయ దేశాల్లో మన భారత్ పేరు మారుమోగడం అంతే నిజం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories