శివన్ కంట కన్నీరు.. గుండెకు హత్తుకున్న మోదీ

శివన్ కంట కన్నీరు.. గుండెకు హత్తుకున్న మోదీ
x
Highlights

విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాలు భారతావనిని బావోద్వేగానికి గురిచేశాయి. ప్రతి ఒక్కరి మనస్సు కలిచి వేసింది. ప్రధాని మోడీ సహా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి భారత పౌరుడు ఉద్వేగానికి లోనయ్యారు.

విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాలు భారతావనిని బావోద్వేగానికి గురిచేశాయి. ప్రతి ఒక్కరి మనస్సు కలిచి వేసింది. ప్రధాని మోడీ సహా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి భారత పౌరుడు ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పటి వరకు చంద్రయాన్-2 యాత్ర అప్రతిహితంగా కొనసాగింది. ఇందు కోసం ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ వారిలో ధైరన్యాన్ని నింపారు.చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇస్రో కీర్తిని..భారత ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందన్న భావనతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ కంటతడి పెట్టారు.

చంద్రయాన్-2 పై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత తట్టుకోలేక ప్రధానిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ప్రధాని మోడీ శివన్ ను హత్తుకుని ఓదార్చారు. భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ ఇస్రో ఛైర్మన్ శివన్ భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పిన దృశ్యాలు దేశ ప్రజలందరినీ ఆకర్షించాయి. శాస్త్రవేత్తల అంకిత భావం ఎంతో గొప్పదని కీర్తించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారంటూ ధైర్యం నింపారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నిషియన్లతో కరాచలనం చేశారు. ఎన్నో రాత్రులు అవిశ్రాంతంగా పని చేస్తున్న సైంటిస్టులను అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories