Aditya L1 Launch: కొనసాగుతోన్న PSLV-C57 రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ

ISRO Aditya L1 Solar Mission Set to Launch Today
x

Aditya L1 Launch: కొనసాగుతోన్న PSLV-C57 రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ

Highlights

Aditya L1 Launch : అంతరిక్ష ప్రయోగంకోసం కొనసాగుతున్న కౌంట్ డౌన్

Aditya L1 Launch: చంద్రగ్రహంపై పరిశోధనలు సాగిస్తున్న ఇస్రో... తాజాగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య ఎల్ -1 ప్రయోగం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగంకోసం కౌంట్ డౌన్ కొనసాగుతోంది.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- PSLV-C57 ఆదిత్య -L1 ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌నుంచి అంతరిక్ష ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తి చేశారు.

సౌర తుపాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఓ అంచనాకు వచ్చేందుకు దోహదపడనుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా చేపడుతోన్న ఆదిత్య L1 చారిత్రక రికార్డును నమోదు చేయబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories