Indian Migrants: భారత్‌కు చేరిన వలసదారుల చేతులకు సంకెళ్లు నిజమేనా?

Indian Migrants: భారత్‌కు చేరిన  వలసదారుల చేతులకు సంకెళ్లు నిజమేనా?
x

Indian Migrants: భారత్‌కు చేరిన అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు నిజమేనా?

Highlights

Indian Migrants: అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వలసదారుల చేతులకు సంకెళ్లు వేశారా? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

Indian Migrants: అమెరికా నుంచి ఇండియాకు అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేశారా? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? నరేంద్రమోదీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అసలు అక్రమ వలసదారులకు సంకెళ్లు వేశారా? బాధితుల వాదన ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసలదారులను గుర్తించి వారి స్వదేశాలకు ట్రంప్ ప్రభుత్వం పంపుతోంది. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహకరిస్తామని ఇండియా హామీ ఇచ్చింది. అమెరికా మిలటరీ విమానం సీ-17లో 104 మంది భారతీయులు ఫిబ్రవరి 5 మధ్యాహ్నం పంజాబ్ అమృత్ సర్ చేరుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారు. అమృత్ సర్ లో విమానం దిగడానికి ముందే తమ చేతులకు ఉన్న సంకెళ్లు విప్పారని పంజాబ్‌లోని గురుదాస్ పూర్ కు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ చెప్పారు.

తమను వేరే శిబిరానికి తీసుకువెళ్తున్నామని అనుకున్నాం. కానీ, తమను ఇండియాకు తీసుకెళ్తున్నామని ఓ పోలీస్ అధికారి చెప్పారు. తమ చేతులకు సంకెళ్లు వేసి , తమ కాళ్లకు గొలుసులు వేసి బంధించారు. అమృత్ సర్ వచ్చాకే తమ సంకెళ్లు తొలగించారని ఆయన పీటీఐకి తెలిపారు. అమెరికాలో 11 రోజులు నిర్భంధంలో ఉంచి తిరిగి ఇంటికి పంపారని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు పవర్ ఖేడా స్పందించారు. అక్రమ వలసదారులను నేరస్తులుగా పంపడం అవమానకరమన్నారు. ఈ ఫోటోలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్ మెంట్ పరిశీలించింది. ఈ ఫోటోలు ఫేక్ అని పీఐబీ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు గ్వాటెమాలాకు చెందినవారిగా వివరించింది.జస్పాల్ సింగ్ తో పాటు మరికొందరు జనవరి 24న మెక్సికో సరిహద్దులో అమెరికా పోలీసుకుల చిక్కారు. ఏజంట్ల చేతిలో మోసపోయినట్టు జస్పాల్ చెప్పారు. లీగల్ గా అమెరికాకు పంపిస్తానని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే వలసదారుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఇండియా కూటమి ఎంపీలు ఫిబ్రవరి 6న పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎందుకు స్పందించలేదని విపక్షాలు ప్రశ్నించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories